బ్రేకింగ్ : సోనియా ససేమిరా.. సీనియర్లు మాత్రం?

కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిలో కొనసాగేందుకు సోనియా గాంధీ ఆసక్తి చూపడం లేదు. సోనియా గాంధీ పార్టీ పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ [more]

Update: 2020-08-24 06:33 GMT

కాంగ్రెస్ అధ్యక్ష్య పదవిలో కొనసాగేందుకు సోనియా గాంధీ ఆసక్తి చూపడం లేదు. సోనియా గాంధీ పార్టీ పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమయింది. ఈ సమావేశంలో తాను అధ్యక్ష్య పదవిలో కొనసాగనని సోనియా గాంధీ స్పష్టం చేసినట్లు తెలిసింది. సీనియర్ నేతలు లేఖ ఆమెను మనస్తాపానికి గురి చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీ తాను అధ్యక్ష్య బాధ్యతలను చేపట్టబోనని ఇప్పటికే స్పష్టం చేశారు. సోనియా గాంధీపై సీనియర్ నేతలు వత్తిడి తెస్తున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని సోనియా గాంధీని సీనియర్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియాను అధ్యక్ష్య పదవిలో ఉండాలని ప్రతిపాదన చేశారు. సోనియా గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు.

Tags:    

Similar News