ఏపీలో ఆగని కరోనా కేసులు…90 వేలకు చేరువలో

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బారిన [more]

;

Update: 2020-07-25 13:08 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 88,671 కు చేరింది. ఒక్కరోజులో ఏపీలో 52 మంది మరణించారు. ఇపపటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 985కి చేరింది. ఇప్పటి వరకూ ఏపీలో 43,255 మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా యాక్టివ్ కేసులు 44,431 ఉన్నాయి. ఈ మేరకు ఆంధ్రపర్దేశ్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News