ఏపీలో లక్షకు చేరువలో కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 7,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల [more]

;

Update: 2020-07-26 13:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 7,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 96,298కి చేరుకుంది. 24 గంటల్లో 56 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,041కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 46,310 మంది కరోనా బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 48,956 ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News