తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు

కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టు మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేసింది. సరైన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది [more]

;

Update: 2021-04-24 01:09 GMT

కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టు మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేసింది. సరైన సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది . అంతేకాకుండా ప్రశ్నల పరంపరని ఉన్నతాధికారులకు సంధించింది. హైకోర్టు విచారణకు హెల్త్ సెక్రెటరీ రీజ్వీ స్వయంగా హాజరయ్యారు. నైట్ కర్ఫ్యూ విధించడంతో వల్ల కరోనా కేసులు తగ్గుతున్నాయి అంటూ హైకోర్టుకి ప్రభుత్వ అధికారులు నివేదించారు. పగటి పూట ఎంటర్ టైన్ మెంట్ సెంటర్లు సినిమా హాల్స్ పబ్బులు బార్లు నడుస్తుంటే కరోనా కేసులు ఎక్కడ తగ్గాయో చూపెట్టాలి అంటూ హైకోర్టు ప్రశ్నించింది. కుంభమేళా కు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటయిన్ లో పెడుతున్నారని, ఇక్కడ ఎందుకు పెట్టలేదని హైకోర్టు సూటిగానే ప్రశ్నించింది.

Tags:    

Similar News