సమ్మెతో వీళ్లంతా కేసీఆర్ కు జై

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొందరికి పండుగయ్యింది. ఈ పుణ్యం కేసీఆరే కట్టుకున్నారని, కేసీఆర్ కు జై…. జై అంటున్నారు… ఇదేంటనుకుంటున్నారా మీరే చదివేయండి. దోపిడీకి తెర… [more]

Update: 2019-10-18 08:53 GMT

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె కొందరికి పండుగయ్యింది. ఈ పుణ్యం కేసీఆరే కట్టుకున్నారని, కేసీఆర్ కు జై…. జై అంటున్నారు… ఇదేంటనుకుంటున్నారా మీరే చదివేయండి.

దోపిడీకి తెర…

ఒకరు బస్సులు లేక చస్తుంటే… ఇంకొకరు బస్సులుండొద్దని పండగ చేసుకుంటున్నారు. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తుంటే…. వీరుమాత్రం కేసీఆర్ కు జై అంటున్నారు. ఇదంతాకూడా ఆర్టీసీ సమ్మె వల్లే వచ్చింది. ఆటోలు, ప్రైవేటు బస్సులు సమ్మెకు ముందు సాధారణ చార్జీలతో నడిచేవి. ఇప్పుడు ప్రైవేటు వాహనదారులు దోపిడీకి తెరతీశారు. క్యాబ్ లైతే 200 కావాల్సిన రూట్ కు 400 ఆ పైన వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు వాహనదారులకు సర్కార్ వంద రూపాయలకే పరిమిట్ ఇస్తుండడంతో వారు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. ఏ రూట్ లో లాభాలోస్తే ఆ రూట్లోనే వెళ్తున్నారు.

కేసీఆర్ హీరో….

ప్రయాణికులు, సామాన్య జనం ఎప్పుడు చర్చలు జరుగుతాయో….. ఎప్పుడు ఈ సమ్మె ముగుస్తుందో నంటూ ఎదురు చూస్తున్నారు. కాని ప్రైవేటు వాహనదారులు, క్యాబ్ డ్రైవర్లు, ఆటోవాలాలు మాత్రం కేసీఆర్ ఇదే విధంగా మొండిగా వ్యవహరించాలని ఈ నెల మొత్తం సమ్మె జరగాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ కు జై అంటున్నారు.

 

Tags:    

Similar News