“అంగుళం” మాటకు కట్టుబడి ఉన్నా

ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజధాని [more]

Update: 2020-01-11 03:54 GMT

ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి హెచ్చరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్న రైతు మహిళలను గాయపర్చడం హేయమన్నారు. డీజీపీని తాను హెచ్చరిస్తున్నానని సుజనా చౌదరి తెలిపారు. వేరే వారి వైఫల్యం వల్ల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. చివరకు గుడికి వెళ్లడాన్ని కూడా అడ్డుకుంటున్నారని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం చూస్తూ ఊరుకోదు….

144 సెక్షన్ ను ఇష్టానుసారం పెడుతున్నారన్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏపీకి జరగబోయే నష్టాన్ని నివారించాలన్నారు. ఢిల్లీ నుంచి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ఆపుతామన్నారు. అమరావతి నుంచి అంగుళం కూడా రాజధానిని తరలించలేరన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సుజనా చౌదరి చెప్పారు. రైతుల ర్యాలీలకు అనుమతించని పోలీసులు వైసీపీ ర్యాలీలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఏదైనా బీజేపీలో అభిప్రాయ బేధాలు ఉంటే తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. తాను దీనిని వదిలిపెట్టబోనన్నారు. ఈ సమస్యను వదిలేస్తే తాను రాజ్యసభ సభ్యుడిగా ఉండటం కూడా వేస్ట్ అని సుజనా చౌదరి చెప్పారు.

Tags:    

Similar News