టీడీపీ, జనసేనలకూ దూరం

ఏపీలో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి మద్దతు ఉండదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. ఇది సునీల్ దేవధర్ [more]

Update: 2019-10-17 08:18 GMT

ఏపీలో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి మద్దతు ఉండదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. ఇది సునీల్ దేవధర్ మాట కాదని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, జేపీ నడ్డా కూడా చెప్పిన మాట అని ఆయన తేల్చిచెప్పారు. గురువారం కర్నూలు జిల్లాకు వచ్చిన సునీల్ఆ దేవధర్ విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ శకం ముగిసిపోతుందన్నారు సునీల్ దేవధర్. బాహుబలి సినిమాను పోల్చిన సునీల్ దేవధర్ చంద్రబాబు కట్టప్ప లాంటి వాడు వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, వైసీపీలతోనూ ఎలాంటి ఒప్పందం లేదని చెప్పారు. బీజేపీ స్వతహాగా ఎదుగుతుందని, రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు అయ్యారన్నారు సునీల్ దేవధర్. జగన్ సీఎం అయి 5 నెలలు మాత్రమే అయ్యింది. ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఆయన పాలన ఎలా ఉంటుందో చూడాలన్నారు సునీల్ దేవధర్

 

Tags:    

Similar News