కేంద్రంపై అసహనం.. అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు, ఉత్తర్వులను కేంద్రం గౌరవిచడం లేదని ఆగ్రహించారు. ప్రభుత్వం తమ [more]
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు, ఉత్తర్వులను కేంద్రం గౌరవిచడం లేదని ఆగ్రహించారు. ప్రభుత్వం తమ [more]
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు, ఉత్తర్వులను కేంద్రం గౌరవిచడం లేదని ఆగ్రహించారు. ప్రభుత్వం తమ సహనాన్ని పరీక్షిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ట్రిబ్యునల్స్ లో ఖాళీలు నియామకాలపై విచారణ చేపట్టిన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ఈ కామెంట్స్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ లో చాలా ఖాళీలున్నాయని, దీనివల్ల అనేక కేసులు పరిష్కారం కాక వాయిదా వేయాల్సి వస్తుందని ఎన్వీ రమణ అన్నారు. రెండేళ్ల నుంచి ఒక్క నియామకం కూడా చేపట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ వద్ద మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం, ట్రిట్యునల్ ను రద్దు చేసి హైకోర్టుకు అధికారాలివ్వడం, కేంద్రంపై ధిక్కరణ చర్యలు చేపట్టడం మినహా మరో ఆప్షన్లు లేవని జస్టిస్ ఎన్వీరమణ తెలిపారు. ఈ కేసును ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు.