బ్రేకింగ్ : జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

జార్ఖండ్ లో జరిగిన జడ్జి హత్యకేసులో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ సంచలన ‌వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ, ఐబీ [more]

Update: 2021-08-06 07:05 GMT

జార్ఖండ్ లో జరిగిన జడ్జి హత్యకేసులో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ సంచలన ‌వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టుకు సీబీఐ, ఐబీ లు సహకరించడం లేదని అన్నారు. జడ్జి మృతిపై సీబీఐ విచారణ జరపాలని ఎన్వీరమణ ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. ఫిర్యాదు చేసినా సీబీఐ, పోలీసులు స్పందించకపోవడం విచారకరమని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కించపర్చడం బాధాకరణమని ఎన్వీ రమణ అన్నారు. సోమవారం సీబీఐ కోర్టు ముందు హాజరు కావాలని ఎన్వీ రమణ ఆదేశించారు. మాఫియా గ్యాంగ్ తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై దాడులకు దిగుతున్నారని, దేశంలో ఈ పెడధోరణి మొదలయిందన్నారు. జార్ఖండ్ లో జడ్జి మృతి ఆ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని ఎన్వీ రమణ అన్నారు.

Tags:    

Similar News