బ్రేకింగ్ : ఉత్తమ్ పై మరోసారి సర్వే ఫైర్

ఓటమి గురించి తాను ప్రశ్నిస్తే తననే సస్పెండ్ చేస్తారా? అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. తాను గాంధీ కుటుంబానికి వీరవిధేయుడినన్నారు. తనను సస్పెండ్ చేసే [more]

Update: 2019-01-07 07:17 GMT

ఓటమి గురించి తాను ప్రశ్నిస్తే తననే సస్పెండ్ చేస్తారా? అని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ప్రశ్నించారు. తాను గాంధీ కుటుంబానికి వీరవిధేయుడినన్నారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఇక్కడి నేతలకు లేదన్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీలే తనను సస్పెండ్ చేయాలన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చింది సోనియగాంధీ మాత్రమే కాని, తాను ఛస్తే సోనియా ఎదుటే ఛస్తానన్నారు.తనను అసెంబ్లీ ఎన్నికలలో ఓడించడానికి పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారని మరోసారి ఫైరయ్యారు. టిక్కెట్లు అమ్ముకున్న వాళ్లే మళ్లీ ఓటమిపై సమీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు. అసలు మీకు బుద్ధి, జ్ఞానం ఉందా? అని తీవ్ర విమర్శలు చేశారు.

తనను ఓడించేందుకు…..

దళితుడినైనా తాను జనరల్ సీట్లో గతంలో గెలిచానన్నారు. కేసీఆర్ బంపర్ మెజారిటీతో గెలిచానా ఆయన ఆడంబరాలకు పోవడం లేదన్నారు. ప్రజలకోసం 24 గంటలు పనిచేస్తున్నారన్నారు. కుంతియా, ఉత్తమ్ లు మాత్రం గాంధీభవన్ కే పరిమితమయ్యారు. దారిన పోయే దానయ్యలను వీరు పెంచి పోషించారన్నారు. నాజీవితం కాంగ్రెస్ తోనే ముగుస్తుందన్నారు. పార్టీ పంపిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. భట్టి విక్రమార్కను, తనను ఓడించేందుకు కాంగ్రెస్ నేతలే కొందరు ప్రయత్నించారన్నారు. వీళ్ల ముఖాలను చూసి ఎవరు ఓట్లేస్తారన్నారు. టిక్కెట్ల కేటాయింపులో ఎందుకు జాప్యం జరిగిందన్నారు.

Tags:    

Similar News