జగదాంబ సెంటర్ లోనే త్వరలో తేల్చుకుంటాం

త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వస్తారని, సత్తా ఉంటే అడ్డుకోవాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. చంద్రబాబు విశాఖకు వస్తే వైసీపీ నేతల [more]

;

Update: 2020-02-28 04:58 GMT

త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వస్తారని, సత్తా ఉంటే అడ్డుకోవాలని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. చంద్రబాబు విశాఖకు వస్తే వైసీపీ నేతల భూకబ్జాలు బయటపడతాయనే భయంతోనే ఆయనను అడ్డుకున్నారని బోండా ఉమ అన్నారు. వైసీపీ రౌడీయిజంతో ఎంతో కాలం పరిపాలన చేయలేదని చెప్పుకొచ్చారు. త్వరలోనే చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారని దమ్ముంటే అడ్డుకోవాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబును అడ్డుకోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బోండా ఉమ తెలిపారు. విశాఖ ఘటనపై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేయనున్నామన్నారు.

Tags:    

Similar News