వంశీలాగానే…గిరి కూడా

వైసీపీ సర్కార్ సంక్షేమానికి పెద్ద పీట వేసిందని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంప్ కార్యాలయంలో [more]

Update: 2019-12-30 11:51 GMT

వైసీపీ సర్కార్ సంక్షేమానికి పెద్ద పీట వేసిందని టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే జగన్ ను కలసినట్లు మద్దాలిగిరి తెలిపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైందన్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మద్దాలి గిరి ఆరోపించారు. గుంటూరు నియోజకవర్గంలో చాలా సమస్యలనున్నాయన్నారు. గుంటూరు నియోజకవర్గానికి 25 కోట్లు ఇవ్వాలని జగన్ ఆదేశించినట్లు మద్దాలి గిరి తెలిపారు. మద్దాలి గిరి మాటలు అచ్చం వల్లభనేని వంశీ చెప్పినట్లుగానే ఉన్నాయి.

Tags:    

Similar News