జగన్ నాతో ఆ మాట అన్నారు

చంద్రబాబు నాయుడు అనే గంజాయి వనం నుంచి బయటపడి జగన్మోహన్ రెడ్డి అనే తులసి వనంలో చేరినందుకు సంతోషంగా ఉందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. [more]

Update: 2019-01-22 12:08 GMT

చంద్రబాబు నాయుడు అనే గంజాయి వనం నుంచి బయటపడి జగన్మోహన్ రెడ్డి అనే తులసి వనంలో చేరినందుకు సంతోషంగా ఉందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇవాళ హైదరాబాద్ లో జగన్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరానన్నారు. అయితే, గత్యంతరం లేక గత ఎన్నికల్లో టీడీపీలో చేరి పోటీచేసి గెలిచినా నాలుగున్నరేళ్లుగా నరకయాతన అనుభవించానన్నారు. అనేక కష్టాలు అనుభవించి, అధికారుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి వైఎస్ జగన్ నాయకత్వం అవసరమన్నారు. చంద్రబాబు కల్లబొల్లి మాటలను నమ్మడం ఇక చాలని, ఆయనది దోపిడీ రాజ్యమన్నారు. ప్రజాస్వామ్య విలువలు లేని నాయకుడి వద్ద ఉండలేకనే జగన్ వద్దకు వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబును ఇంకా నమ్మితే ప్రజలు పాతాళానికి వెళ్లే ప్రమాదం ఉంది.

రాష్ట్రం నాశనం అవుతుందనే…

రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని మోసం చేశారని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని, కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేశారన్నారు. ఈ ద్రోహాలన్నీ చూడలేక ఇంకా చంద్రబాబును నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందనే ఉద్దేశ్యంతోనే వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పారని, అందుకు అనుగుణంగా ఇవాళ పార్టీ సభ్యత్వానికి, విప్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీన అధికారికంగా వైసీపీలో చేరతామని ప్రకటించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి దొడ్డిదారిలో డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలో చేరిన వ్యక్తి అని, వైఎస్ బిక్షతో గెలిచిన ఆయనకు తనను విమర్శించే హక్కు లేదన్నారు. రానున్న రోజుల్లో జగన్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News