రాజన్న రాజ్యం కాదిది

కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సహనంగా ఉన్నామని ఇకపై ఉపేక్షించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు [more]

Update: 2019-09-06 12:05 GMT

కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సహనంగా ఉన్నామని ఇకపై ఉపేక్షించేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటు వేసిన వారిని వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన ఓ సమావేశంలో లోకష్ మాట్లాడారు.ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా బాధితులకు అండగా ఉంటామన్నారు.గుంటూరు జిల్లా పిన్నెల్లిలో 200 మందిపై అనేక అక్రమ కేసులు పెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తీసుకొచ్చారన్నారు.

Tags:    

Similar News