విద్యుత్తు ఛార్జీల పెంపుకు నేడు టీడీపీ

విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు టీడీపీ నిరసన దీక్షలు చేపట్టింది. విద్యుత్తు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరోజు దీక్షకు [more]

Update: 2020-05-21 02:24 GMT

విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు టీడీపీ నిరసన దీక్షలు చేపట్టింది. విద్యుత్తు ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరోజు దీక్షకు దిగనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఇళ్లలోనే దీక్ష చేపడుతున్నారు. ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తూ విద్యుత్తు ధరలను పెంచిందని టీడీపీ ఆరోపిస్తోంది. విద్యుత్తు ఛార్జీలను పెంచబోనని అధికారంలోకి వచ్చిన జగన్ మాట తప్పారని చంద్రబాబు ఫైరయ్యారు. గత మూడు నెలలుగా ఉపాధి లేక, వేతనాలు లేక అల్లాడుతున్న జనంపై విద్యుత్తు ఛార్జీల భారం మోపుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ నిరసనను తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News