తెలంగాణ ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతారని తేల్చింది ఇండియా టుడే గ్రూప్ - యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన సర్వే. ముఖ్యమంత్రి గా కేసీఆర్ కి 43 శాతం మంది ఓటు వేయగా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి 18 శాతం మంది, బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డికి 15 శాతం మంది పట్టం కట్టారు. ఇక ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దిన్ ఓవైసీ వైపు 4 శాతం మంది నిలిచారు. కేసీఆర్ సర్కార్ పనితీరు బాగుందని 48 శాతం మంది చెప్పగా 25 శాతం మంది బాగాలేదని, 16 శాతం మంది చెప్పలేమని తేల్చారు. ఇక ప్రధానిగా మోదీ పనితీరును 41 శాతం మంది బాగుంది అనగా 32 శాతం మంది బాగోలేదని, 24 మంది చెప్పలేమని చెప్పినట్లు సర్వే తెలిపింది. ప్రధానిగా 44 శాతం మంది నరేంద్ర మోదీ కావాలి అనుకుంటే, 39 శాతం మంది రాహుల్ గాంధీ కావాలని కోరుకుంటున్నట్లు తెలింది.