నిరుద్యోగులకు కేసీఆర్ భారీ నజరానా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఉద్యోగాల నియామకాలపై ఆయన ప్రకటన చేశారు

Update: 2022-03-09 05:10 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో బిగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఉద్యోగాల నియామకాలపై ఆయన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91,147 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. పోలీసు శాఖలో 18,334, విద్యా శాఖలో 13,086, వైద్య ఆరోగ్య శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, రెవెన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో4,311, సాగునాటీ శాఖలో 2,622, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879 ఖాళీలున్నాయని చెప్పారు. 11,103 కాంటాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈరోజు నుంచి 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇకపై కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు ఉండవని కేసీఆర్ చెప్పారు. దీనివల్ల ఏటా ప్రభుత్వంపై ఏడు వేల కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఉద్యోగాల నియామకానికి పదేళ్లు వయసు ను పెంచుతున్నట్లు తెలిపారు. గ్రూప్  వన్ , గ్రూప్ టూ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. 

మాకు రాజకీయాలంటే టాస్క్... 
తెలంగాణ ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమన్నారు. అంతులేని వివక్ష, అన్యాయం కారణంగానే తెలంగాణ సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలిగిపోయిందన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తాను లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. 2014 లో తెలంగాణ ఏర్పడేనాటికి లక్షల సంఖ్యలో వలసలు, ఆత్మహత్యలు, నిరాశతో నిరుద్యోగ యువత, రైతుల ఇబ్బందులు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి తెలంగాణ కోసం గుప్పెడు మందితో ఉద్యమం ప్రారంభిస్తే 14 ఏళ్లకు కల సాకారమయిందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను పునర్నిర్మించుకోవాలని తాను చెప్పానన్నారు. వేరే పార్టీలకు రాజకీయలంటే ఒక గేమ్ అని, టీఆర్ఎస్ కు మాత్రం అది ఒక టాస్క్ అని కేసీఆర్ అన్నారు.
ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారు...
తెలంగాణను తెచ్చుకున్న తర్వాత ఏకాగ్రతను కొందరు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాధ్యతగా తీసుకుని పోవడమే తమ లక్ష్యమని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ నినాదం ఏర్పడిందన్నారు. వరసగా అన్నీ సాధించుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు కమెడియన్లకు వాడే భాషను ఇప్పుడు తెలంగాణ భాషను హీరోలకు వాడుతున్నారన్నారు. తెలంగాణ భాష వాడితేనే హీరో క్లిక్ అవుతున్నాడని, సినిమా హిట్ అవుతుందన్నారు. తెలంగాణ సంస్కృతిని రక్షించుకున్నామని చెప్పారు. నీళ్లలో వాటాను కొట్లాడి మరీ తెచ్చుకున్నామని చెప్పారు. హల్ది వాగుల్లో నీళ్లు పారుతున్నాయన్నారు. పంటల ఉత్పత్తి పెరిగిందన్నారు. ఏడు వేల కొనుగోళ్ల కేంద్రాలను పెట్టినా సరిపోవడం లేదని అన్నారు. విద్యుత్తు కొరత లేకుండా చేసుకున్నామని చెప్పారు.
లక్షా 30 వేల ఉద్యోగాలను...
నియామకాల విషయంలోనూ తమ ప్రభుత్వం స్పీడ్ గానే ఉందని చెప్పారు. ఇప్పటి వరకూ లక్షా ముప్ఫయి వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. లక్షా 56 వేల ఉద్యోగాలను నోటిఫై చేశామని చెప్పారు. 95 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగుల విభజన పూర్తి చేసుకున్నామని చెప్పారు. అటెండర్ నుంచి ఆర్డీవో వరకూ అన్నీ స్థానికులకే ఇచ్చామని చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి ప్రత్యేకంగా జీవోను తెచ్చామని చెప్పారు. 22,736 ఉద్యోగాలను క్రమబద్దీకరించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫ్లెండ్లీ సర్కార్ గా వ్యవహరిస్తున్నామని చెప్పారు.


Tags:    

Similar News