ఇవిగో ఆధారాలు.. బేరసారాలు ఏ స్థాయిలో అంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొయినాబాద్ ఫాంహౌస్ లో ఉన్న వీడియోలను మీడియా సమావేశంలో బయటపెట్టారు.;

Update: 2022-11-03 15:28 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొయినాబాద్ ఫాంహౌస్ లో ఉన్న వీడియోలను మీడియా సమావేశంలో బయటపెట్టారు. బీఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డాలు ఈ ఆపరేషన్ చేస్తున్నారని రామచంద్రభారతి అంటున్న మాటలు వీడియోలో కనిపించాయి.ఆర్ఎస్ఎస్ ప్రత్యేక వ్యవస్థ లని, బీజేపీ రాజకీయ పార్టీ అని కాని ఆర్ఎస్ఎస్ బీజేపీ వెనకే ఉంటుందని రామచంద్ర భారతి తెలిపారు. తుషార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ లో ఉన్నారని, ఆయన అమిత్ షా, జేపీ నడ్డాలతో మాట్లాడతారని ఆయన అన్నట్లు వినిపించింది. తాము రెడీగా ఉన్నామని బేరం కుదిరితే రెడీ అయిపోవాలని ఆయన అన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గాన్ని కూలిస్తే పార్టీలకతీతంగా పోరాడామని, ఇప్పుడు కూడా ఆ అవసరం ఉందన్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది తామేనని వారు చెప్పారన్నారు. ఈ వీడియోలో అమిత్ షా పేరు ఇరవై సార్లు, రెండు సార్లు మోడీ పేరు చెప్పారన్నారు. ఇంత డబ్బు వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ను ప్రధాన కార్యాలయంగా చేసుకుని ఈ బేరసారాలను జరుపుతున్నారన్నారు.

సిగ్గూ భయం లేకుండా...
ఎటువంటి భయం లేకుండా, సిగ్గులేకుండా ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయని కేసీఆర్ అన్నారు. ఇంతటి దుర్మార్గమైన పనులను యువత వ్యతిరేకించాలన్నారు. తాము కూడా దీనిపై ఉద్యమం చేపడతామని చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే తాము కొనడానికి సిద్ధమని చెప్పడం సిగ్గు చేటని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్నవి ఆషామాషీ ఆధారాలు కాదన్నారు. తాము వై కేటగిరి భద్రత కూడా కల్పిస్తామని హామీ ఇస్తూ ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నాలు చేశారన్నారు. ప్రతి రాష్ట్రంలో తమతో నేతలు టచ్ లో ఉన్నారని చెబుతున్నారన్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేయబోతున్నామని తెలిపారు. పూర్తిగా రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ప్రభుత్వం ఉందన్నారు.
దేశ వ్యాప్త ఉద్యమం...
దేశంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రపంచం మొత్తానికి తెలియజేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా అందరికీ పంపుతున్నామని తెలిపారు. దీని కథేంతో తేలాల్సిందేనని కేసీఆర్ అన్నారు. ఇంత అరాచకాలను అడ్డుకోక పోతే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్ట లేదన్నారు. తమకు ప్లాన్ అర్థమయిన వెంటనే హోంమంత్రికి ఫిర్యాదు చేశామన్నారు. పకడ్బందీగా పోలీసుల సహకారంతో ఆధారాలను సేకరించామని కేసీఆర్ తెలిపారు. పీఠాధిపతులు, స్వామీజీలతో ఈ తతంగమంతా నడుపుతున్నారన్నారు. ఏం జరిగినా తాను ఎదుర్కొనేందుకు సిద్ధమని కేసీఆర్ తెలిపారు. ఎవరు తమను ఏం చేయాలేరన్న ధీమా వారిలో కనిపిస్తుందన్నారు. 2015 నుంచి దేశంలో వీళ్లు చేసిన అరాచకాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. వారి కాల్ డేటా వేల పేజీలు వచ్చిందన్నారు. అందుకే అందరికీ పంపామని కేసీఆర్ తెలిపారు. 


Tags:    

Similar News