సెలవులియ్యవయ్యా సామీ

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరకూ సెలవులు ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం నో అంటుంది

Update: 2022-01-17 08:03 GMT

ఎప్పుడూ అంతే. వెంటనే చర్యలు తీసుకోరు. అప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని మొండి పట్టు పట్టారు. చివరకు పరీక్షలను రద్దు చేయక తప్పింది కాదు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకూ సెలవులు ప్రకటించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది. పాఠశాలలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడిపోతోన్నారు.

ఏపీలోనే ఎక్కువ....
నిజానికి తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో రోజుకు రెండు వేల కేసులు నమోదవుతుంటే ఏపీలో రోజుకు నాలుగువేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు ప్రకటించకుండా విద్యాసంస్థలను కొనసాగించడంపై విమర్శలు విన్పిస్తున్నాయి. తీరా కేసులు పెరిగాక సెలవులిస్తే పరువు మరోసారి పోగొట్టుకోవాల్సి వస్తుంది.
వ్యాక్సినేషన్ పెంచాలంటూ...
చిన్నారులకు ఏమాత్రం కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కోవిడ్ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేస్తున్నారు. ట్రేసింగ్ , టెస్టింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. టెస్ట్ ల సంఖ్య తో పాటు వ్యాక్సినేషన్ ను పెంచాలని జగన్ ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.


Tags:    

Similar News