బాబు బాధ పగోడికి కూడా రావద్దు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడు పర్యటనలకు వెళ్లినా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది

Update: 2022-01-07 02:58 GMT

చంద్రబాబు బాధ పాలిటిక్స్ లో పగవాడికి కూడా రాకూడదు. ఆయన ఎప్పుడు పర్యటనలకు వెళ్లినా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. సహజంగా పార్టీ నాయకులకు తాను తప్ప ఎవరూ తోపు కాకూడదని భావిస్తారు. జనాలు, కార్యకర్తల నుంచి కూడా "సీఎం.. సీఎం" అంటూ నినాదాలు చేస్తే చెవులకు ఇంపుగా ఉంటుంది. పవన్ కల్యాణ్ వంటి వారు ఆ నినాదం వద్దని పైకి చెబుతున్నా లోపల మాత్రం సంతోషపడతారు.

ఎప్పుడు వెళ్లినా....
కానీ చంద్రబాబు బ్యాడ్ లక్. ఆయన ఎప్పుడు వెళ్లినా ఆ నినాదం తప్ప వేరేవి విన్పిస్తుండటం ఇబ్బందికరంగా మారింది. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలాంటి అనుభవాలు విరక్తిని తెప్పిస్తాయి. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో ఇదే జరిగింది. టీడీపీ క్యాడర్ నుంచి జనసేనతో పొత్తు పెట్టుకోవాలని, పవన్ కల్యాణ్ తో కలసి నడవాలని నేరుగా చంద్రబాబును కోరారు. నిజానికి ఆయనకు ఇది ఇబ్బందికరమైన విషయమే.
గతంలో జూనియర్ ....
పొత్తుల విషయం తాను తేల్చాల్సి ఉంది. కానీ ఇక్కడ కార్యకర్తల నుంచే డిమాండ్ వినిపిస్తుంది. దీనికి చంద్రబాబు లవ్ స్టోరీ చెప్పి అక్కడ నవ్వులు పూయించారని చెబుతున్నా ఆయన మొహంలో మాత్రం నవ్వులేదు. అందుకు కారణం గతంలో కుప్పంలో చంద్రబాబు పర్యటించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కన్పించేవి. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని కార్యకర్తల నుంచి డిమండ్ విన్పించేది.
ఇప్పుడు పవన్....
దానిని సెట్ రైట్ చేసుకుని వెళ్లిన చంద్రబాబుకు ఈసారి పవన్ కల్యాణ్ పొత్తు నినాదం ఇబ్బందికరంగా మారింది. నిజానికి చంద్రబాబు నాయకత్వంపై క్యాడర్ కే నమ్మకం లేదని దీనిని బట్టి సులువుగా అర్థమవుతుంది. బాబు వయసు అయిపోయిందని, ఊతకర్ర లేనిదే ఎన్నికలకు వెళ్లలేరన్న ప్రత్యర్థి పార్టీల విమర్శలు నిజం అనుకునేలా క్యాడర్ చేస్తుంది. అది బయటకు తెలీకుండా ఆయన జోకులేసి వెళ్లిపోయినా రాత్రంతా నిద్ర లేకుండానే గడిపి ఉంటారు.అందుకే పాలిటిక్స్ లో బాబు బాధ పగ వాడికి కూడా రాకూడదని అంటున్నారు.



Tags:    

Similar News