యువగళం @ 1,000 కి.మీ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది

Update: 2023-04-21 03:32 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయాత్ర నేడు వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. ఇప్పటి వరకూ లోకేష్ 990.7 కిలోమీటర్లు నడిచారు. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో 77వరోజు యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ఆదోని రాత్రి బస నుంచి పాదయాత్ర ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. 8.15 గంటలకు ఆదోని బైపాస్ క్రాస్ వద్ద స్థానికులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ఉదయం 9.10 గంటలకకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి వద్ద స్టూడెంట్స్ జేఏసీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. 9.50 గంటలకు ఆదోని దర్గా వద్ద ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు.

సమావేశాలవుతూ...
ఉదయం10.10 గంటలకు ఎమ్మిగనూరు సర్కిల్ లో మెకానిక్స్ అసోసియేషన్ తో సమావేశం కానున్నారు. 10.35 గంటలకు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో భేటీ అవుతారు. 10.50 గంటలకు రైల్వేస్టేషన్ రోడ్డులో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 11.05 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్ పిఎస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 11.20 గంటలకు గవర్నమెంట్ హాస్పటల్ వద్ద ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమవుతారు.
శిలాఫలకాన్ని...
ఉదయం 11.40 గంటలకు మేదరగిరి బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో లోకేష్ పాల్గొంటారు. 12.45 గంటలకు ఆదోని రామాలయం వద్ద భోజన విరామానికి ఆగుతారు. సాయంత్రం3.15 గంటలకుక ఆదోని రామాలయం వద్ద నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. 3.25 గంటలకు ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద 1000 కి.మీ.కు పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ లోకేష్ లాఫలకాన్నిఆవిష్కరించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆదోని కడికొత్త క్రాస్ వద్ద బహిరంగసభ లో లోకేష్ ప్రసంగించనున్నారు. రాత్రికి ఆదోని కడికొత్త క్రాస్ వద్ద బస చేయనున్నారు.


Tags:    

Similar News