డ్రగ్స్‌ అమ్ముతూ పట్టుబడ్డ తెలుగు యువతి

మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఓ తెలుగు యువతి హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబడింది. నగరంలో కొకైన్‌, ఎల్‌ఎస్టీ పిల్స్‌, హెరాయిన్‌ను విక్రయిస్తున్న అనురాధ అనే యువతిని పట్టుకున్నట్లు రాజేంద్ర నగర్‌ డీసీపీ జగదీశ్వరరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడిరచారు. సాధారణంగా డ్రగ్స్‌ దందాలో నైజీరియన్లు పోలీసులకు దొరుకుతూ ఉంటారు, మగాళ్లు మాత్రమే ఈ దందాలో ఉండటం కూడా మామూలు విషయమే.

Update: 2023-09-11 16:17 GMT

మాదక ద్రవ్యాలు అమ్ముతూ ఓ తెలుగు యువతి హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబడింది. నగరంలో కొకైన్‌, ఎల్‌ఎస్టీ పిల్స్‌, హెరాయిన్‌ను విక్రయిస్తున్న అనురాధ అనే యువతిని పట్టుకున్నట్లు రాజేంద్ర నగర్‌ డీసీపీ జగదీశ్వరరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడిరచారు. సాధారణంగా డ్రగ్స్‌ దందాలో నైజీరియన్లు పోలీసులకు దొరుకుతూ ఉంటారు, మగాళ్లు మాత్రమే ఈ దందాలో ఉండటం కూడా మామూలు విషయమే. తొలిసారిగా ఓ మహిళ, ముఖ్యంగా తెలుగు యువతి పట్టుబడిరదని డీసీపీ తెలిపారు. నగరంలోని మోకిల వద్ద డ్రగ్స్‌ అమ్ముతున్న అనురాధను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 52 గ్రాముల కొకైన్‌, 45 ఎల్‌ఎస్టీ పిల్స్‌, 8 గ్రాముల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు.

అనురాధతో పాటు గుంటూరుకు చెందిన శివ, వరలక్ష్మి టిఫిన్స్‌ అధినేత ప్రభాకర్‌ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్‌ చేసి ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద వారిపై కేసు పెట్టారు. ఈ డ్రగ్స్‌ కేసులో అనురాధ కీలక వ్యక్తి అని జగదీశ్వరరెడ్డి మీడియాకు చెప్పారు. ఆమెకు గతంలో వివాహం జరిగిందని, భర్తతో విడాకులు తీసుకుని విడిగా ఉంటోందని ఆయన తెలిపారు. అనురాధ తరచుగా గోవా వెళ్లేదని, అక్కడ ఆమెకు నైజీరియాకు చెందిన జేమ్స్‌తో పరిచయం ఏర్పడిరదని డీసీపీ వెల్లడిరచారు. జేమ్స్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకుని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌ తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తోందని ఆయన చెప్పారు. మొదట్లో కస్టమర్లుగా ఉండి, తర్వాత డ్రగ్స్‌ సరఫరాదారులుగా మారి, అనురాధకు సహకరిస్తున్న శివ, ప్రభాకరరెడ్డిలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకుని, వారి నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్‌ విలువ దాదాపు 14 లక్షలు ఉంటుందని డీసీపీ పేర్కొనారు.

Tags:    

Similar News