టీడీపీకి ఊహించని షాక్

తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు [more]

Update: 2019-12-06 14:59 GMT

తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీద మస్తాన్ రావు రేపు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లాలో బీద సోదరులు పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉంటూ వచ్చారు. ఎన్నికలకు ముందు కూడా బీద మస్తాన్ రావు వ్యాపారాలపై ఐటీ దాడులు జరిగాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. బీద మస్తాన్ రావు ఇటీవల ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావు పార్టీని వీడటం టీడీపీకి జిల్లాలో కోలుకోలేని నష్టమేనని చెప్పాలి.

Tags:    

Similar News