బ్రేకింగ్ : మండలిలో రచ్చ రచ్చ
శానసమండలిలో సీఆర్డీఏ చర్చ, మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చ ముగిసింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ పట్టుబడుతోంది. కానీ వైసీపీ మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడానికి [more]
శానసమండలిలో సీఆర్డీఏ చర్చ, మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చ ముగిసింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ పట్టుబడుతోంది. కానీ వైసీపీ మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడానికి [more]
శానసమండలిలో సీఆర్డీఏ చర్చ, మూడు రాజధానుల ప్రతిపాదనపై చర్చ ముగిసింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ పట్టుబడుతోంది. కానీ వైసీపీ మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడానికి వీలు లేదని గట్టిగా కోరుతోంది. బిల్లులను ఆమోదించాలని మంత్రులు కోరుతున్నారు. రెండు పార్టీలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నాయి. మంత్రి కొడాలి నాని టీడీపీ సభ్యుల వైపునకు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు పార్టీల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోడియం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ, లోకేష్ లు పోటా పోటీగా నినాదాలు చేస్తున్నారు. శానసమండలిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో సభను కొద్దిసేపు మండలి ఛైర్మన్ వాయిదా వేశారు. మండలిలో చోటు చేసుకున్న పరిణామమాలను గమనించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గ్యాలరీలోకి వచ్చారు.