Thandel teaser: తండేల్ ...... సంథింగ్ న్యూ
అక్కినేని వారసుడు, యువసామ్రాట్ నాగచైతన్య, హైబ్రిడ్ పీస్ సాయి పల్లవి జంటగా, ఒక్క మూవీ తోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి దర్శకత్వం లో వస్తున్న కొత్త సీనియా తండేల్. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఈ మూవీని చాలా భారీగా నిర్మిస్తోంది.;

Akkineni Naga Chaitanya New movie, Thandel teaser has released. Looks Interesting
Thandel teaser: అక్కినేని వారసుడు, యువసామ్రాట్ నాగచైతన్య, హైబ్రిడ్ పీస్ సాయి పల్లవి జంటగా, ఒక్క మూవీ తోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి దర్శకత్వం లో వస్తున్న కొత్త సీనియా తండేల్. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ఈ మూవీని చాలా భారీగా నిర్మిస్తోంది. గత సంవత్సరం నవంబర్ లో షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా లేటెస్టుగా 'Essence of #Thandel ' అంటూ ఒక వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది.
ఈ వీడియో లో కథ చెప్పలేదు గాని, నేపధ్యం చెప్పేలా ఆ వీడియో ని కట్ చేశారు. ఒక జాలరి శ్రీకాకుళం జిల్లాలోని ఓ తీర ప్రాంత గ్రామంలో పని చేస్తుంటాడు. అతనికి దేశభక్తి ఎక్కువ. చేపల వేట సమయంలో అనుకోకుండా పాకిస్థాన్ సరిహద్దులో ప్రవేశించి అక్కడి నావికా దళ సిబ్బందికి దొరికిపోతాడు. ఆ చిక్కుల నుంచి ఎలా బయట పడ్డాడు అనేది ఈ కథ లా ఉంది.
ఈ టీజర్ చివర్లో "మీ దేశమే ఒక ఊడిపోయిన మొక్క, అలాంటి ఈ దేశాన్ని ముష్టి వేసిన మాకు ఎంత ఉండాలి" అనే డైలాగ్ హీరో దేశభక్తి ని చాటుతోంది. ఈ సినిమాలో ఎంతో కొంత కొత్తదనం కనిపిస్తోంది. గత రెండేళ్లలో గత రెండేళ్లుగా సరైన విజయాలు లేని చైతన్య ఇటీవల దూత అనే వెబ్ సిరీస్ తో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో అని అభిమానులు ఆశిస్తున్నారు.