ఊర్థ్వలోకానికి ఉచిత ప్రయాణమే..!
ఉత్తరపదేశ్‌లో ఇటీవల కాలంలో క్రిమినల్స్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అక్కడ మనలాగా అరెస్టులు, కోర్టులో హాజరు పరచడాలు, గంటల కొద్దీ వాదనలు... సుదీర్ఘమైన, చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన ప్రక్రియ నడవదు. క్రిమినల్ అని తేలిన తర్వాత వెంటనే ఎన్‌కౌంటర్ జరుగుతుంది. యోగీ మార్కు పాలన ఇది. అక్కడి ప్రజలకు తమ ముఖ్యమంత్రి తరహా బుల్‌డోజర్, ఎన్‌కౌంటర్ పరిపాలనే నచ్చుతున్నట్లుంది. అందుకే రెండో టర్మ్ ఆయన్ని గెలిపించారు. అది వేరే విషయం.
యోగీతో యాగీనా..? ఆ నిందితుడు ఎన్‌కౌంటర్
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల కాలంలో క్రిమినల్స్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అక్కడ మనలాగా అరెస్టులు, కోర్టులో హాజరు పరచడాలు, గంటల కొద్దీ వాదనలు... సుదీర్ఘమైన, చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన ప్రక్రియ నడవదు. క్రిమినల్ అని తేలిన తర్వాత వెంటనే ఎన్‌కౌంటర్ జరుగుతుంది. యోగీ మార్కు పాలన ఇది. అక్కడి ప్రజలకు తమ ముఖ్యమంత్రి తరహా బుల్‌డోజర్, ఎన్‌కౌంటర్ పరిపాలనే నచ్చుతున్నట్లుంది. అందుకే రెండో టర్మ్ ఆయన్ని గెలిపించారు. అది వేరే విషయం.
శుక్రవారం మధ్యాహ్నం అయోధ్య సమీపంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో అనీస్ ఖాన్ అనే నిందితుడ్ని పోలీసులు కాల్చి చంపారు. గత నెల సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై అనీస్‌ఖాన్, అతని అనుచరులు ఆజాద్, విశ్వంభర్ దయాళ్ దాడి చేసి తీవ్రంగా కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను లక్నో ప్రభుత్వ ఆస్పత్రికి తలరించారు. రైలులో ఓ సీటు విషయంలో గొడవ కానిస్టేబుల్‌తో అనీస్‌ఖాన్ బ్యాచ్‌కు వివాదం మొదలైంది. ఈ క్రమంలో నిందితులు తీవ్రంగా కొట్టడంతో కానిస్టేబుల్ తలకు, మొఖానికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టు రైల్వే పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తలంటింది.
అప్పటి నుంచి యూపీ పోలీసుల వేట మొదలైంది. నిందితులు అయోధ్య సమీపంలో ఉన్నారని శుక్రవారం పోలీసులకు ఉప్పందింది. ‘నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లారు. వాళ్లు మా కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపారు. లొంగిపొమ్మని హెచ్చరించాం. కానీ వాళ్లు వినలేదు. ప్రాణరక్షణ కోసం మా వాళ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు అనీస్‌ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆజాద్, దయాళ్‌ను అరెస్ట్ చేశాం’ మీడియాతో చెప్పారు అయోధ్య సీనియర్ ఎస్పీ రాజ్‌కరణ్ నయ్యర్. ‘పోలీసుల జోలికెళ్తే ఊర్ధ్వలోకానికి ఉచిత ప్రయాణమే!’ అని నేరగాళ్లని యోగీ హెచ్చరించినట్లు లేదూ!