శోభాయాత్రకు షరతులతో కూడిన అనుమతి

నేడు హనుమన్ జయంతి. అయితే హనుమాన్ జయంతి యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, [more]

Update: 2021-04-27 01:54 GMT

నేడు హనుమన్ జయంతి. అయితే హనుమాన్ జయంతి యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ లు శోభాయాత్రను తలపెట్టాయి. పోలీసులు శోభాయాత్రకు అనుమతి నిరాకరించడంతో భజరంగ్ దళ్ హైకోర్టును ఆశ్రయించింది. గౌలిగూడ రామమందిరం నుంచి తాడ్ బన్ హనుమాన్ ఆలయం వరకూ హైకోర్టు శోభాయాత్రకు అనుమతి ఇచ్చింది. ఈ యాత్రలో 21 మందికి మించి అనుమతించవద్దని కోరారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకే శోభాయాత్ర ను అనుమతించాలని కోరింది. శోభాయత్రను వీడియో ద్వారా చిత్రీకరించి కోర్టుకు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News