త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్స్ కి ఏదో ఒక లోపం ఉంటుందని... త్రివిక్రమ్ తీసిన సినిమాలను గమనిస్తే ఆ విషయం తెలుస్తుందని అజ్ఞాతవాసి టైంలో చాలామంది మాటల మాంత్రికుడిని విమర్శించారు. జల్సా, జులాయిలో ఇలియానాను అమాయకంగా, సన్ అఫ్ సత్యమూర్తి లో సమంతని డయాబెటిస్ పేషెంట్ లా చూపించాడు. తాజాగా ఆ విషయంపై త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూ లో స్పందించాడు. తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎక్కువుగా అమాయకంగా... పెద్దగా ఏమి తెలియనివారిగా ఉండేవని చెప్పిన త్రివిక్రమ్ ఆ క్యారెక్టర్స్ ని అలా డిజైన్ చెయ్యడానికి గల కారణం కూడా చెప్పాడు. తాను పుట్టి పెరిగిన వాతావరణం.... తాను ఎక్కువగా అబ్జర్వ్ చేసిన ఆడవారే తన సినిమాల్లో హీరోయిన్స్ ని అమాయకంగా చూపెట్టడానికి కారణం అని ఈ మాటల మాంత్రికుడు తెలిపారు.
అందుకే స్త్రీలకు ప్రాధాన్యత
అయితే ప్రస్తుతం సమాజంలో స్త్రీల పాత్ర ప్రధానమైనదని.. అది దృష్టిలో పెట్టుకునే అరవింద సమేతలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాణ్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన రైటింగ్ స్కిల్స్ లో చాలా మార్పులొచ్చాయని చెబుతున్నాడు. ఇక సినిమా తియ్యడమనేది అంత సులువైన పని కాదని.. తాను దర్శకుడిగా ఒకటి అనుకుంటానని.. కానీ అది కెమెరామెన్ మిగతా వాళ్లని దాటుకుని వెళ్లేసరికి తాను అనుకున్న రూపం ఒక్కోసారి రావొచ్చు రాకపోవచ్చు అంటూ చెప్పిన త్రివిక్రమ్... కథ రాసుకున్నపుడు అనుకున్నట్లుగా సినిమా ఔట్ పుట్ రావడం అన్నిసార్లూ జరగదన్నాడు. అందుకే అజ్ఞాతవాసి సినిమా తాను అనుకున్నట్లుగా తెరకెక్కలేదు.