టీఆర్ఎస్ కు షాక్.. మాజీ ఎంపీ గుడ్ బై

టీఆర్ఎస్ కి మునుగోడు ఉప ఎన్నికల వేళ షాక్ తగిలింది. మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు

Update: 2022-10-14 12:34 GMT

తెలంగాణ రాష్ట్ర సమితికి మునుగోడు ఉప ఎన్నికల వేళ షాక్ తగిలింది. మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని చెబుతున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మునుగోడు టీఆర్ఎస్ సీటును ఆశించారు. బీసీలు ఎక్కువగా ఉన్న మునుగోడుకు అభ్యర్థిని ప్రకటించాలని కోరారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో...
అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని హైకమాండ్ ఎంపిక చేసింది. కేసీఆర్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని కూడా ప్రకటించారు. నిన్న టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్ వెంట కూడా పాల్గొన్నారు. బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ల ఛైర్మన్ గా వ్యవహరించారు. బూర పార్టీని వీడటం ఎన్నికల వేళ చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News