బెంగాల్ లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామా.. రీజన్ ఇదే

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను స్పీకర్ [more]

Update: 2021-05-13 01:16 GMT

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను స్పీకర్ కు సమర్పించారు. దీంతో బీజేపీకి 77 స్థానాల నుంచి బలం 75కి పడిపోయింది. బీజేపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన జగన్నాధ్ సర్కార్, నిసిత్ ప్రమాణిక్ దిన్హాటా లు రాజీనామాలు చేశారు. వీరు ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. అయితే తాము ఎంపీలుగానే కొనసాగుతామని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఆదేశం ప్రకారం రాజీనామా చేసినట్లు వారు తెలిపారు. బెంగాల్ ఎన్నికల్లో నలుగురు ఎంపీలను బీజేపీ బరిలోకి దించగా, ఇద్దరు ఓడిపోయి, ఇద్దరు గెలిచారు. గెలిచిన ఆ ఇద్దరూ రాజీనామా చేశారు.

Tags:    

Similar News