సంపూర్ణ లాక్ డౌన్ తప్పదు… సీఎం సంచలన వ్యాఖ్య
మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచే నమోదవతున్నాయి. ఇప్పటికే [more]
మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచే నమోదవతున్నాయి. ఇప్పటికే [more]
మహారాష్ట్రలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచే నమోదవతున్నాయి. ఇప్పటికే వీకెండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ విధించడం మినహా మరే గత్యంతరం లేదని ఉద్ధవ్ థాక్రే అభిప్రాయపడ్డారు. ఒక నెల రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తే కరోనా అదుపులోకి వస్తుందని, అందరూ సహకరించాలని ఉద్ధవ్ థాక్రే కోరారు. అఖిలపక్ష సమావేశంలో ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.