జగన్ కు ఛాన్స్ లేదన్న ఉండవల్లి

వైఎస్ జగన్ చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని హైకమాండ్ మీద తోసేయవచ్చని, [more]

Update: 2020-03-23 12:28 GMT

వైఎస్ జగన్ చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని హైకమాండ్ మీద తోసేయవచ్చని, కానీ జగన్ కు ఆ ఛాన్స్ లేదన్నారు. జగన్ ఆ పార్టీకి హైకమాండ్ కాబట్టి పూర్తిస్థాయి బాధ్యతను జగన్ వహించాల్సి ఉంటుందన్నారు. మూడు రాజధానుల అంశాన్ని స్మూత్ గా డీల్ చేయవచ్చని తెలిపారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడితే తప్పేంటని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక అధికారికి కులం అంటగట్టడాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టారు. కులం సంగతి ప్రజలకు తెలియదా? అని ప్రశ్నించారు. జగన్ పక్కన ఆ కులం వాళ్లు లేరా? అని అన్నారు. వైసీపీ అంటే రెడ్ల పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ అని జనాలకు తెలుసునని, తెలుసే ఓట్లేశారన్నారు. జగన్ ఏడాది పాలన పూర్తయిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. టీడీపీ నుంచి నేతలను తీసుకున్నంత మాత్రాన పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదన్నారు. జగన్ వర్సెస్ చంద్రబాబు ల మధ్య మాత్రమే ఆట జరుగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. చంద్రబాబు ఇమేజ్ పెరిగితేనే పార్టీ బలపడుతుందన్నారు. ఒక మీడియా చానల్ ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News