ఉభయ సభల్లో వైసీపీ నినాదాలు… సభలు వాయిదా

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పై కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే గెజిట్ ను [more]

Update: 2021-07-22 05:47 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ పై కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసమే గెజిట్ ను విడదుల చేశామని మంత్రి తెలిపారు. లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధుల విడుదల, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి అంశాలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రాంగారెడ్డి ప్రాజెక్టును అక్రమంగా కడుతుందని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందన్నారు. లోక్ సభ, రాజ్యసభల్లో వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతో ఉభయ సభలు కొద్దిసేపటి వరకూ వాయిదా పడ్డాయి.

Tags:    

Similar News