వంశీ ఆవేదన

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించినందుకు వంశీ చంద్రబాబుకు ధన్యావాదాలు తెలిపారు. పార్టీలో ఉన్నన్నాళ్లూ [more]

Update: 2019-10-28 04:32 GMT

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి తాను అందించిన సేవలను గుర్తించినందుకు వంశీ చంద్రబాబుకు ధన్యావాదాలు తెలిపారు. పార్టీలో ఉన్నన్నాళ్లూ తాను ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తన రాజీనామా లేఖపై స్పందించిందుకు చంద్రబాబుకు ధన్యవాదాలన్నారు. తాను ఏ పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందో గత లేఖలోనే వివరించానని వంశీ రెండో లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ హింసను తాను ధైర్యంగా మీ మద్దతుతోనే ఇన్నాళ్లూ ఎదుర్కొన్నానని తెలపారు. గత ఎన్నికల్లోనే తనపై పోటీ చేయవద్దని వత్తిడి తెచ్చిన విషయం మీకు కూడా తెలుసునన్నారు. కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమేనని వంశీ ఆవేదన చెందారు.

Tags:    

Similar News