తొందరపడవద్దన్న బాబు

చర్చలు లేవు. కేవలం లేఖలే. వల్లభనేని వంశీ, చంద్రబాబుల మధ్య లేఖలు మాత్రం నడుస్తున్నాయి. వల్లభనేని వంశీ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ [more]

Update: 2019-10-28 06:46 GMT

చర్చలు లేవు. కేవలం లేఖలే. వల్లభనేని వంశీ, చంద్రబాబుల మధ్య లేఖలు మాత్రం నడుస్తున్నాయి. వల్లభనేని వంశీ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ లేఖకు చంద్రబాబు బదులిచ్చారు. మరో లేఖ వంశీ రాశారు. తనకు అన్ని పోరాటాల్లో మద్దతిచ్చినందుకు వంశీ రెండో లేఖలో చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి మళ్లీ చంద్రబాబు స్పందించారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, మీ సమస్యలను ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో చర్చించాలని సూచించారు. మీకు పార్టీతో పాటు తాను కూడా అండగా ఉంటానని రెండో లేఖలో కూడా చంద్రబాబు వంశీకి భరోసా ఇచ్చారు. కాగా వంశీ తన రాజీనామా లేఖను చంద్రబాబుకు మాత్రమే పంపారు. స్పీకర్ కు పంపలేదు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చంద్రబాబు వంశీ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News