వివేకా హ‌త్యపై విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించి నిజ‌మైన దోషుల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… 1998 [more]

Update: 2019-03-15 12:59 GMT

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐతో విచార‌ణ జ‌రిపించి నిజ‌మైన దోషుల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… 1998 నుంచి వైఎస్ కుటుంబాన్ని స‌మూలంగా అంతం చేయ‌డానికి చంద్ర‌బాబు కుట్ర‌లు చేశార‌ని ఆరోపించారు. గ‌తంలో వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసులో దోషుల‌కు తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలోనే ర‌క్ష‌ణ క‌ల్పించార‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల ఈ హ‌త్య కేసులో దోషుల‌ను స‌త్ప్ర‌వ‌ర్తన కింద విడుద‌ల చేశార‌న్నారు. త‌న‌తో పెట్టుకుంటే ఫినిష్ అవుతార‌ని అసెంబ్లీలో చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చాక కొన్నిరోజుల‌కే వైఎస్ఆర్ మ‌ర‌ణించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. వైఎస్ మ‌ర‌ణంపై ఇంకా అనుమానాలు నివృత్తి కాలేద‌న్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి నీతి, విలువ‌లు లేని వ్య‌క్తని, దుర్మార్గుడ‌ని ఆరోపించారు. ఈ హ‌త్య‌లో సుత్ర‌ధారులు చంద్ర‌బాబు, లోకేష్ అని, అమ‌లుప‌రిచింది ఆదినారాయ‌ణ‌రెడ్డి అని ఆరోపించారు.

టీడీపీది త‌ప్పుడు ప్ర‌చారం….

మొద‌ట ఆయ‌న మ‌ర‌ణించార‌ని తెలియ‌గానే గుండెపోటు అని అంతా భావించార‌ని, గాయాలు చూసి హ‌త్య‌గా అనుమానించామ‌న్నారు. హ‌త్య‌పై కూడా టీడీపీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. కుటుంబానికి పెద్ద‌గా వివేకా ఉన్నార‌ని, జ‌గ‌న్ కు దిశానిర్దేశం చేస్తున్నారు త‌ప్ప త‌న‌కు ప‌ద‌వులు కావాల‌ని ఎప్పుడూ అడ‌గ‌లేద‌న్నారు. కుటుంబ క‌ల‌హాలు ఉంటే నిన్న రాత్రి వ‌ర‌కు పార్టీ కోసం ఎందుకు ప్ర‌చారం చేస్తార‌ని, జ‌మ్మ‌ల‌మ‌డుగు, క‌డ‌ప ఇంఛార్జి బాధ్య‌త‌లు ఎందుకు తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌కు డీజీపీపై న‌మ్మ‌కం లేద‌ని, జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగాక గంట‌లోనే త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని అన్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు చూడాల్సిన ఇంటెలిజెన్స్ అధికారులు చంద్ర‌బాబుకు తాబేదార్లుగా మారార‌ని పేర్కొన్నారు. ప‌త్తికొండ‌లో వైసీపీ నేత నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసును కూడా పోలీసులు నీరుగార్చార‌ని గుర్తు చేశారు. కాబ‌ట్టి ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. సిట్ డీజీపీ కింద ప‌నిచేస్తుంద‌ని, డీజీపీపైనే త‌మకు న‌మ్మ‌కం లేద‌న్నారు. గ‌తంలో వేసిన సిట్లు ఏవీ నిజాలు బ‌య‌ట‌కు తీసుకురాలేక‌పోయాయ‌న్నారు.

Tags:    

Similar News