విజయసాయి అసంతృప్తి
కేంద్ర బడ్జెట్ నిరాశకు గురిచేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం [more]
;
కేంద్ర బడ్జెట్ నిరాశకు గురిచేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం [more]
కేంద్ర బడ్జెట్ నిరాశకు గురిచేసిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ఏపీ ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి అన్నారు. తాము ఎంతగానో ఎదురు చూశామన్నారు. అలాగే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపు, ఏపీకి రావాల్సిన నిధులపై పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు కూడా బడ్జెట్ లో నిధులను కేటాయించకపోవడంపై విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.