వ్యాపారవేత్తగా ఎదగాలని ఉందా ? ఎందుకాలస్యం ? ‘మానుస్’ కు వెంటనే హాజరవ్వండి

మీకు వ్యాపారవేత్తగా ఎదగాలని ఉంటే ఆడుతూ, పాడుతూ మీలోని బిజినెస్, కమ్యూనిటీ స్కిల్స్ ను డెవలప్ చేసుకునేందుకు ‘మానుస్ ’ కార్యక్రమానికి వెంటనే హాజరుకండి

Update: 2023-08-29 07:30 GMT

వ్యాపారవేత్తగా ఎదగాలని ఉందా ?

ఎందుకాలస్యం ? ‘మానుస్’ కు వెంటనే హాజరవ్వండి

మీకు వ్యాపారవేత్తగా ఎదగాలని ఉంటే ఆడుతూ, పాడుతూ మీలోని బిజినెస్, కమ్యూనిటీ స్కిల్స్ ను డెవలప్ చేసుకునేందుకు ‘మానుస్ ’ కార్యక్రమానికి వెంటనే హాజరుకండి. సెప్టెంబర్ 1,2 తేదీల్లో విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీ ఆధ్వర్యంలో బీబీఏ (బిజినెస్ మేనేజ్మాంట్ ) డిపార్టుమెంటు ఈ బిజినెస్ మేనేజ్ మెంట్ మీట్ ను నిర్వహిస్తోంది. కళాశాల ఆవరణలోని ఓల్డ్ సెమినార్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడే రూ. 100తో రిజి స్ట్రేషన్ చేయించుకోండి. వసతి కావాలంటే మరో రూ.50 అదనం.

బిజినెస్ మేన్ ను వెలికి తీసే ‘మానుస్’ కార్యక్రమానికి హాజరై, జీవితంలో విజేతలుగా నిలవండని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల ఆధ్వర్యంలో బీబీఏ (బిజినెస్ మేనేజ్మెంట్) శాఖ సెప్టెంబరు 1,2 తేదీల్లో జాతీయ స్థాయిలో ఈ మేనేజ్మెంట్ మీట్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఓల్డ్ సెమినార్ హాల్ లో నిర్వహిస్తారు. ఈ వినూత్న కార్యక్రమానికి మేనేజ్మెంట్ విద్యార్థులు, డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి బీబీఏ, బీకాం, ఎంబీఏ విద్యార్థులు ఫార్మల్, ఇన్ ఫార్మల్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.

కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఫార్మల్ ఈవెంట్స్ లో బిజినెస్ క్విజ్, హ్యూమన్ రీసోర్స (మానవ వనరులు) ఫైనాన్స్, యంగ్ మేనేజర్, ప్రోడక్ట్ లాంచ్, బ్రాండ్ హంట్ వంటివి ఉండగా, ఇన్ఫార్మల్ ఈవెంట్స్ లో మిస్టర్ అండ్ మిస్ మానుస్, డాన్స్ , క్విక్ బీ, స్పాట్ ఫొటోగ్రఫీ పోటీలు ఉంటాయి.

‘మానుస్’ లిటరరీ, కల్చరల్ మీట్ కార్యక్రమానికి మెకానిక్స్ (Mechanix ) టైటిల్ స్పాన్సర్ చేయగా, రాజ్ దర్భార్ ఫ్యామిలీ రెస్టారెంట్ , హరివిల్లు సంస్థలు కో స్పాన్సర్లు గా ఉన్నాయి. ఎన్ జే గాడ్జెట్స్, షైనీ డెంటల్ క్లినిక్, బోబ హాలిక్, గాడ్జెట్ షాక్, ఆంధ్ర హాస్పిటల్స్ , రెడ్ ఓవెన్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

అఫీషియల్ (అధికారిక) మీడియా పార్టనర్లగా, స్కైలైన్ ఫొటోగ్రఫీ, డిజిటల్ మీడియా పార్టనర్ గా తెలుగు.పోస్ట్, రేడియో పార్టనర్ గా రెడ్ ఎఫ్ (93.5 ఎఫ్ ఎం) సహకారం అందిస్తున్నారు. ‘మానుస్ ’ కార్యక్రమాన్ని వస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ,ఈ మీట్ ను సక్సెస్ చేయవలసిందిగా ఈవెంట్ కో- ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ కోరుతున్నారు.

MANUS OFFICIAL

Event

Official page of 'MANUS'.

A National Level Management Event by

The Department of 'BBA'

Andhra Loyola College.

manusloyola.wixsite.com/website

Tags:    

Similar News