వైఎసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలకు, సభలకు వస్తున్న జనమంతా ఓట్లేసేవారుకాదని మంత్రి ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున చిరంజీవి సభ పెడితే నలభై వేల మంది వచ్చారని, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థికి 4100 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అలాగే విశాఖలో విజయమ్మ ఎంపీగా నామినేషన్ వేయడానికి యాభే వేల మందితో వెళితే 91 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారన్నారు. బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు 500 మందితో నామినేషన్ వేసి విజయం సాధించిన విషయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు. జనం వచ్చినంత మాత్రాన సంబరపడిపోవద్దని, వారంతా ఓట్లేసే వాళ్లు కాదని ఆది ఎద్దేవా చేశారు.