వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిసింది. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరింది. దీనికి రాజ్ నాధ్ సింగ్ సుముఖత వ్యక్తం చేసినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ పై హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ, చంద్రబాబులిద్దరూ విచారణ చేపట్టకుండా కేసులో కన్ క్లూజన్ ఇచ్చారని వారు ఆరోపించారు. అలాగే ప్రస్తుతం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారని, జగన్ కు భద్రతను పెంచాలని వారు హోంమంత్రిని కోరారు.జగన్ కు భద్రత పెంచకుంటే ప్రాణాపాయం ఉందని వారు వివరించారు. అలాగే ఆపరేషన్ గరుడపైనా విచారించాలని కోరారు. తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.