మండలిలో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది…యనమల వార్నింగ్

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో సీఆర్డీఏ, అధికార వికేంద్రీకరణ గురించి ప్రస్తావన ఉంటే మళ్లీ తాము శాసనమండలిలో వ్యతిరేకిస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రస్తావన [more]

Update: 2020-03-02 06:58 GMT

బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో సీఆర్డీఏ, అధికార వికేంద్రీకరణ గురించి ప్రస్తావన ఉంటే మళ్లీ తాము శాసనమండలిలో వ్యతిరేకిస్తామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రస్తావన ఉంటే మళ్లీ శాసనమండలిలో సవరణలకు ప్రతిపాదిస్తామని యనమల చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లుల ప్రస్తావన ఉండకూడదన్నారు. ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్ పరిశీలించాలని యనమల కోరారు. తమ హక్కులను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో సీఆర్డీఏ, మూడు రాజధానుల అంశం ఉండకూడదన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్లి ప్రజాగ్రహానికి గురికావద్దని యనమల సూచించారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులు వెళ్లకుండా ప్రభుత్వమే అడ్డుకుందన్నారు. ప్రభుత్వం మొండిగా వెళితే శాసనమండలిలో సేమ్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పారు. తుగ్లక్, హిట్లర్, ముస్సోలిని, నీరో కలగలిపితే జగన్మోహన్ రెడ్డి అని యనమల అన్నారు.

Tags:    

Similar News