కాపీ పథకాలు… తాత్కాలిక భవనాలు

జగన్ రూపొందించిన నవర్నాలను పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని, ఆయన ఒక్క పథకాన్నైనా స్వంతంగా రూపకల్పన చేశారా అని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. [more]

Update: 2019-01-25 12:34 GMT

జగన్ రూపొందించిన నవర్నాలను పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని, ఆయన ఒక్క పథకాన్నైనా స్వంతంగా రూపకల్పన చేశారా అని వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వతంగా ఒక్క భవనాన్నీ నిర్మించలేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారిస్తుంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అన్ని సర్వేల్లోనూ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుందన్నారు. ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో ‘సమర శంఖారావం’ పేరుతో తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో జగన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News