వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో విచారణ సక్రమంగా జరగడం లేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవాలని నిర్ణయించింది. జగన్ పై హత్యాయత్నం, డీజీపీ వ్యవహారశైలి, విచారణ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేసేందుకు పార్టీ ముఖ్యనేతలు సుమారు 15 మంది ఢిల్లీ వెళ్లనున్నారు. హత్యాయత్నం ఘటనపై ఏర్పాటుచేసిన ఏపీ సిట్ పై తమకు నమ్మకం లేదని, ఏదైనా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని వారు విన్నవించనున్నారు. జగన్ పై జరిగిన హత్యాయత్నం తర్వాత డీజీపీ, ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యాఖ్యల సీడీలు కూడా ఫిర్యాదులో జతచేసి రాష్ట్రపతికి ఇవ్వనున్నారు.