అమరావతి కరకట్టపై టెన్షన్… టీడీపీ నేతలను…?
ప్రజా వేదికను కూల్చి నేటికి ఏడాది పూర్తయింది. దీంతో టీడీపీ నేతలు ప్రజావేదిక వద్దకు వెళ్లాలని కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను [more]
ప్రజా వేదికను కూల్చి నేటికి ఏడాది పూర్తయింది. దీంతో టీడీపీ నేతలు ప్రజావేదిక వద్దకు వెళ్లాలని కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను [more]
ప్రజా వేదికను కూల్చి నేటికి ఏడాది పూర్తయింది. దీంతో టీడీపీ నేతలు ప్రజావేదిక వద్దకు వెళ్లాలని కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చినందుకు నిరసన తెలియజేయాలని టీడీపీ భావించింది. అయితే అక్కడ పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. దీంతో అమరావతి కరకట్ట మీద టెన్షన్ నెలకొంది. ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కనీసం నిరసన తెలియజేసేందుకు అనుమతి ఇవ్వకపోవడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్రలతో పాటు మరికొందరు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.