ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యం

కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు [more]

Update: 2019-05-25 07:50 GMT

కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ తాడేపల్లిలో జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలవడానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రజలకు ఉన్న నమ్మకం కూడా కారణమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఎంపీలంతా చిత్తశుద్ధితో పనిచేయాలని, ఏ స్థాయిలో అయినా పోరాడటానికి సిద్ధంగా ఉండాలన్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎన్నిక ఇవాళ జరగాల్సి ఉన్నా జగన్ వాయిదా వేశారు. రేపు ఎంపీలను తీసుకొని జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలని కోరనున్నారు.

Tags:    

Similar News