మరోసారి మోదీకి జగన్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి జలవివాదాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వివాదాలు పరిష్కాం [more]

;

Update: 2021-07-07 13:23 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరోసారి జలవివాదాలపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. వివాదాలు పరిష్కాం కావడం లేదని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తోడేస్తుందని, తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని జగన్ మోదీకి రాసిన లేఖలో కోరారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నందున నీటిని సముద్రంలోకి వృధాగా వదలాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ కోరారు.

Tags:    

Similar News