ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు దీవించారు
పార్టీ మేనిఫేస్టోను 90 శాతం అమలు పర్చినది వైసీపీయేనని జగన్ తెలిపారు. వైసీపీ ప్లీనరీలో జగన్ ప్రారంభోపన్యాసం చేశారు.
ఓదార్పు యాత్రతో మార్చి 2011న పార్టీ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి పార్టీ వెన్నంటి ఉన్న కుటుంబానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో కుట్రలు జరిగినా, ఎన్ని రాళ్లు పడినా గుండెలు చెదరలేదన్నారు పార్టీ మేనిఫేస్టోను 90 శాతం అమలు పర్చినది వైసీపీయేనని తెలిపారు. వైసీపీ ప్లీనరీలో జగన్ ప్రారంభోపన్యాసం చేశారు. తన తండ్రి ఇచ్చిన జగమంత కుటుంబం చేయి ఎప్పుడూ వదలనని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం మ్యానిఫేస్టో అమలు చేయకుండా, వాటిని పూర్తిగా వారి వెబ్‌సైట్ నుంచి తొలగించిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేకపోయిందన్నారు.
మూడేళ్ల పాలనతో...
ఈ మూడేళ్లలో సంక్షేమ పాలనను అందించామని చెప్పారు. ప్రతి పేదవాడికి పథకాలు అందేలా చూడగలిగామన్నారు. ప్రతి కుటుంబానికి మంచి చేశామన్నారు. వైసీపీ మ్యానిఫేస్టోను చూస్తేనే టీడీపీకి భయం అని జగన్ అన్నారు. ప్రజలను మోసం చేసిన వారు ఈరోజు విమర్శలు చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్క పథకానికి కూడా ఆయన కేరాఫ్ అడ్రస్ గా మారలేకపోయారని చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ఎల్లో మీడియా మరోసారి కుట్రలు ప్రారంభించిందన్నారు. ప్రజలను మోసం చేసిన వారికి ఒక వర్గం మీడియా అండగా ఉందన్నారు. తనకు ఆ మద్దతు లేకపోయినా ప్రజల బలం ఉందన్నారు. సంక్షేమ పథకాలపై చర్చించి, ప్రజలకు మరింత ఉపయోగపడేలా ఈ ప్లీనరీలో చర్చిద్దామని జగన్ అన్నారు.