కొండా దంపతుల అవసరం మాకేముంది?

కొండా దంపతుల అవసరం తమ పార్టీకి లేదని వైఎస్ షర్మిల పార్టీ నేతలు చెప్పారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. విలువలు గురించి కొండా [more]

;

Update: 2021-04-19 00:48 GMT

కొండా దంపతుల అవసరం తమ పార్టీకి లేదని వైఎస్ షర్మిల పార్టీ నేతలు చెప్పారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. విలువలు గురించి కొండా మురళి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వారు ఎద్దేవా చేశారు. వారిని తమ పార్టీలోకి ఆహ్వానించామని చెప్పడం నిజం కాదని తెలిపారు. వారు ఎన్ని పార్టీలో మారారో? వారికి ప్రజల్లో ఉన్న విలువ ఏ పాటిదో అందరికీ తెలుసునని వైఎస్ షర్మిల అనుచరులు అన్నారు. షర్మిల దగ్గర నుంచి కొండా దంపతులకు ఎలాంటి ఆహ్వానం వెళ్లలేదని వారు చెప్పారు. వరంగల్ జిల్లాలో వైఎస్ అభిమానులు భారీగా ఉన్నారని, వారి మద్దతు తమకు అవసరం లేదని వారు అన్నారు.

Tags:    

Similar News