ఐటీ ఆయుధంగా మారిందా?

ఆదాయపు పన్ను శాఖ ప్రకటన వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. రెండువేల కోట్ల అక్రమ లావాదేవీలు చంద్రబాబు బినామీలకు చెందినవేనని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు [more]

Update: 2020-02-14 07:53 GMT

ఆదాయపు పన్ను శాఖ ప్రకటన వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి తెరదీసింది. రెండువేల కోట్ల అక్రమ లావాదేవీలు చంద్రబాబు బినామీలకు చెందినవేనని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు అక్రమాలు మూడు లక్షల కోట్లకు చేరుకుంటాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తన బినామీల పేరుతో చంద్రబాబు అక్రమాస్తులను కూడబెట్టారని ఆరోపించారు. ఐటీ శాఖ దాడులపై పవన్ కల్యాణ‌్ నోరు ఎందుకు మెదపడం లేదన్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు తనపై సాక్ష్యాలుంటే నిరూపించాలని కోరుతున్నారని, ఐటీ దాడుల సంగతేంటని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

లోకేష్, యనమల……

పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనపడినట్లే దేశమంతా అవినీతి జరిగినట్లు జగన్ కు కన్పిస్తుందని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా నలభై చోట్ల ఐటీ శాఖ దాడులు జరిపితే కేవలం 85 లక్షలు మాత్రమే దొరికిందని, విషప్రచారం చేయడం మానుకోవాలని లోకేష్ కోరారు. చంద్రబాబు వద్ద నలభై ఏళ్లలో ఎంతోమంది పర్సనల్ సెక్రటరీగా పనిచేశారని, వారిపై దాడులు జరిగితే చంద్రబాబుకు అంటగట్టడమేంటని మాజీ మంత్రి యనమల ప్రశ్నించారు. మొత్తం మీద రెండు పార్టీలకూ ఐటీ దాడులు ఆయుధంగా మారాయి.

Tags:    

Similar News