పోలీసు పదోన్నతులపై వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

పదోన్నతులు, ప్రాదాన్యత కలిగిన పోలీసు పోస్టులు ఒకే సామాజకవర్గానికి ఇచ్చారని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని అధికార పార్టీకి సవాల్ [more]

Update: 2019-02-06 07:59 GMT

పదోన్నతులు, ప్రాదాన్యత కలిగిన పోలీసు పోస్టులు ఒకే సామాజకవర్గానికి ఇచ్చారని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని అధికార పార్టీకి సవాల్ విసిరింది. ఒక సామాజకవర్గానికి చెందిన వారికి పోస్టింగుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారని, వారిని ఎన్నికలకు ఉపయోగించుకుంటారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఏపీ హోంమంత్రితో పాటు డీజీపీ ఖండించారు. తామకు కుల వివక్ష లేదని పేర్కొన్నారు. ఈ విషయమై ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వివక్ష వాస్తవం కాదా..?

ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమితులైన ఒక సామాజకవర్గం వారి పేర్లను వెల్లడించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఈ పదోన్నతలు, పోస్టింగుల వ్యవహారం జరిగిందని ఆరోపించారు. కుల వివక్ష లేకపోతే ముఖ్యమైన ఇంటలిజెన్స్ శాఖను పూర్తిగా ఒకే సామాజకవర్గం వారితో ఎందుకు నింపారని ప్రశ్నించారు. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే ‘సీబీఎన్ ఆర్మీ’ అనే బోర్డు పట్టుకున్న ఫోటోలను ఆయన ప్రదర్శించారు. ఈ అంశాలపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. తాము సామాజకన్యాయం కోసం మాట్లాడుతున్నామని… ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. డీజీపీ ఎవరి పక్షానా లేకపోతే… జగన్ పై హత్యాయత్నం జరిగిన గంటలోనే వైసీపీ అభిమాని చేశాడని ఎందుకు చెప్పారని అన్నారు.

Tags:    

Similar News